Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

వైభవంగా ముగిసిన దసరా శరన్నవరాత్రులు

వైభవంగా ముగిసిన దసరా శరన్నవరాత్రులు

 

విశేష పూజలు.. శాస్త్రోక్తముగా నిమజ్జనం.

ఉత్సవాలకు గంట్ల విరాళం రూ 51,500.

సింహాచలం అక్టోబర్ 13(ప్రజాక్షేత్రం):అప్పన్న పాదాల చెంత తొలిపావంచ వద్ద శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ యూత్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు విజయదశమి పర్వదినంతో ఘనంగా ముగిసాయి . చివరి రోజు దుర్గాదేవి అమ్మవారికి ఉత్సవ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో విశేష పూజాది కార్యక్రమాలు జరిపించారు. యజ్ఞ యాగాదులు, ప్రత్యేక హోమాలు కూడా ఘనంగా నిర్వహించారు. ఆపై పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడంతోపాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆపై యాగ పూర్ణ కలశ లో పవిత్ర జలాలను భక్తులు పై ప్రోక్షణ చేసారు.. మంత్ర పుష్పము చెప్పి వేద ఆశీర్వాదాలు అందచేశారు.గత పది రోజులుగా అమ్మవారిని వేర్వేరు రూపాల్లో అలంకరించి భక్తులకు దర్శనాలతో కనువిందు చేశారు. విజయదశమి సందర్భంగా శనివారం రాత్రి దుర్గా దేవి అమ్మవారిని ఘనంగా నిమజ్జనం చేశారు. ఆయా పూజా కార్యక్రమాల్లో స్థానిక కార్పొరేటర్ పీవీ నరసింహం, అప్పన్న ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టులు సంఘం కార్యదర్శి, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయము సలహా మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులతో పాటు గ్రామానికి చెందిన పలువురు భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వడంతో అమ్మవారి ఉత్సవాలు అతి వైభవంగా జరిపించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ ఉత్సవాలకు గంట్ల శ్రీనుబాబు ఈ ఏడాది రూ.51, 500 రూపాయలు తన వంతు విరాళంగా అందజేశారు.ఇక అడవి వరం గ్రామం లో ఆయిల్ మిల్ వద్ద శ్రీ గణేష్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న దుర్గా దేవి ఉత్సవాలు రానున్న శనివారం తో ముగుస్తాయి..పూల తోట లో .అప్పన్న జమ్మి చెట్టు వద్ద గంట్ల శ్రీను బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Related posts