చిలుకూరు బాలాజీని దర్శించుకున్న మేఘాలయ గవర్నర్
మొయినాబాద్ రూరల్, అక్టోబరు 13(ప్రజాక్షేత్రం): చిలుకూరు బాలాజీని మేఘాలయ గవర్నర్ విజయ శంకర్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం ఆలయానికి వచ్చిన ఆయనకు ప్రధాన అర్చకులు సీఎస్. రంగరాజన్ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దివ్యమైన ఆశీర్వాదం చేయించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ విశిష్టతను ఆయనకు వివరించారు. శనివారం స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని గవర్నర్ తెలిపినట్లు రంగరాజన్ పేర్కొన్నారు. ఆయనతో పాటు మొయినాబాద్ సీఐ పవన్‌కుమార్ రెడ్డి, ఎస్‌ఐ నర్సింహులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రోజా, పోలీసు, ఆలయ సిబ్బంది ఉన్నారు.