నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న వేముల గ్రామ ప్రజలు….
-నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు
వేముల, గద్వాల అక్టోబర్13(ప్రజాక్షేత్రం):జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల పరిధిలోని వేముల గ్రామంలో గత రెండు రోజుల నుండి నీటి సమస్య ఉన్నది. దసరా పండగ సందర్భంగా కూడా నీళ్లు రాకపోవడంతో గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలాసార్లు గ్రామంలో ఉన్న సమస్యల గురించి పంచాయతీ కార్యదర్శి కి విన్నవించిన ఎలాంటి లాభం లేకపోలేదు గత రెండు రోజుల నుండి గ్రామంలో నీటి కొరత ఉన్నందున గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు