Praja Kshetram
తెలంగాణ

తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా ఇబ్రాం శేఖర్..

తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా ఇబ్రాం శేఖర్..

 

హైద‌రాబాద్ అక్టోబర్ 15(ప్రజాక్షేత్రం):తెలంగాణ బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేట‌ర్‌గా ఇబ్రాం శేఖ‌ర్ నియామకం అయ్యారు. ఆయనతో పాటు.. ఈశ్వర్‌ను కూడా బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్‌గా నియమించారు. వీరి నియమకాన్ని బీఎస్‌పీ సెంట్రల్ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్ ప్రకటించారు. ఈ మేరకు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి పేరిట ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో తెలంగాణకు పార్టీ కోఆర్డినేటర్‌గా ఒకరు మాత్రమే ఉండేవారు. కానీ, ఈసారి మాత్రం ఇద్దరికి అవకాశం ఇచ్చారు పార్టీ అధినేత్రి మాయావతి. మంగళవారం నాడు రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో పార్టీ కోఆర్డినేటర్లుగా ఇబ్రాం శేఖర్, ఈశ్వర్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శేఖర్.. తనకు కల్పించిన అవకాశాన్ని బహుజనుల ఐకమత్యానికి, బీఎస్పీ బలోపేతానికి పూర్తి స్థాయిలో ఉపయోగిస్తానని చెప్పారు. బీఎస్పీలో తనకు ఇంతటి ఉన్నత అవకాశం కల్పించిన పార్టీ అధినాయకురాలు మాయావతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారాయన.

-తెలంగాణలో బీఎస్పీకి కొత్త జవసత్వాలు..

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా బీఎస్పీ కొత్త జవసత్వాలను అందిపుచ్చుకుంటోంది. కొత్త తరానికి నాయకత్వాన్ని అందిస్తోంది. దళిత బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమిస్తున్న బీఎస్పీ.. పల్లె స్థాయి నుంచి పట్టు బిగిస్తోంది. బీఎస్పీ అధినేత్ర మాయావతి మార్గదర్శకత్వంలో.. దళిత బహుజనుల ఐకమత్యం కోసం పోరు సాగిస్తోంది.

Related posts