గిరిజన రైతుల భూములు ఆక్రమించిన భూస్వామి పై క్రిమినల్ కేసులు పెట్టాలి
-సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్
శంకర్ పల్లి అక్టోబర్ 15(ప్రజాక్షేత్రం):కొండకల్ తాండ గిరిజన రైతుల భూములను వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అమ్మిన భూములను తిరిగి స్వాధీనం చేసుకొని అపర్ణ కన్స్ట్రక్షన్, కు అమ్మేసిన భూస్వామి విక్రమ్ రెడ్డి పై క్రిమినల్ కేసులు పెట్టాలని గిరిజన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేసి అనంతరం డిఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ కొనుగోలు చేసిన రైతుల భూములతో పాటు బిల్ దాఖలు మరియు సీలింగు అలాగే అసైన్డ్ భూములను చెరువులను ఆక్రమించి వందల కోట్లకు అమ్ముకొని భూస్వామి విక్రమ్ రెడ్డి తీవ్రంగా మోసం చేశాడని ఆయన విమర్శించారు. విక్రమ్ రెడ్డి ఆగడాలకు అడ్డే లేకుండా పోయిందని పోలీసులను అధికారులను అడ్డం పెట్టుకొని బౌన్సర్ ద్వారా బెదిరించి అక్రమ కేసులు బనాయించి గిరిజన రైతులను నానా తండాలు పెడుతున్నారని గిరిజన రైతులు ఏడ్చిన అధికారులకు కనబడటం లేదని ఆయన మండిపడ్డారు. గిరిజన రైతులకు న్యాయం జరిగే వరకు సిపిఐ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వం తక్షణమే స్పందించి వారి భూములను వారికి ఇప్పించాలని అలాగే ప్రభుత్వ సైన్డ్ సీలింగ్ భూములను కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు కే రామస్వామి శంకర్ పల్లి పార్టీ మండల కార్యదర్శి పి సుధీర్ నందిగామ కార్యదర్శి గడ్డం జంగయ్య, రైతులు శంకర్ నాయక్, రవి నాయక్, లక్ష్మణ్ నాయక్, రాజు తదితరులు పాల్గొన్నారు.