మరకత శివాలయాన్ని దర్శించుకున్న శంకర్ పల్లి సిఐ శ్రీనివాస్ గౌడ్
శంకర్ పల్లి అక్టోబర్ 15(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని చందిప్ప గ్రామంలోని చాళుక్య కాలంలో నాటి మరగత శివాలయాన్ని దర్శించుకున్న శంకర్ పల్లి సిఐ శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా ఆలయ పరిసరాలను వీక్షించి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకం చేసి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి సిఐ శ్రీనివాస్ గౌడ్ ను ఫోటో శాలువాతో ఘనంగా సన్మానించారు. వారితో పాటు ఆలయ కమిటీ సభ్యులు హనుమంతు, గోపాల్, ఆలయ పూజారి ప్రమోద్, ఉన్నారు.