రైతులు రోడ్లపై వరి ధాన్యాన్ని ఆరబెట్టడంతో పలు ప్రమాదాలు
-రైతులు వరి ధాన్యం ఆరబెట్టడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది.
-రోడ్లపై వడ్లు ఆరబెట్టడమే కాకుండా పక్కన పెద్ద పెద్ద బండలు పెట్టడంతో ప్రమాదాలు.
-ప్రాణాలు కోల్పోతున్న వాహనదారులు.
-రోడ్డు సగం వారికే అంకితం.
-రోడ్డుపై ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలు వడ్లే.
-రోడ్లపై వరి ధాన్యాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.
-ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకొని రైతన్నలు రోడ్లపై వరి ధాన్యాన్ని ఆరబెట్టొద్దు.
నిజామాబాద్ అక్టోబర్:17(ప్రజాక్షేత్రం ప్రతినిధి గంధం చిరంజీవి) తెలంగాణ రాష్ట్రంలో వరి కోతలు మొదలయినాయి రైతన్నలు పొలాలు కోస్తూ పండించిన మరి ధాన్యాన్ని రోడ్లపైకి తీసుకువస్తున్నారు. రోడ్ల మీదనే కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నాయి.ఎక్కడ చూసినా వడ్ల కుప్పలే రోడ్లపై ఆరబెడుతున్నారు. రోడ్లపై సగం రోడ్డు వారికే అంకితం అవుతుంది. ఓవైపు మొక్కలు అలాగే వడ్లు ఆరబెట్టడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. వడ్లు ఆరబెట్టడమే కాకుండా పక్కన బండలు పెట్టడంతో వాహనదారులు వెళుతూ గమనించగా వాటిపై ఎక్కి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.మరికొందరు కింద పడి తీవ్ర గాయాలపాలవుతున్నారు. ఎక్కడ చూసినా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. చూస్తూ చూస్తుండగానే ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి దయచేసి రైతులు రోడ్డుపైన వడ్లు ఆరబెట్టొద్దు ఆరబెట్టిన వరి ధాన్యం పక్కన బండలు పెట్టకూడదని వాహనదారులు కోరుతున్నారు.