Praja Kshetram
తెలంగాణ

జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన లింగమూర్తి ని సన్మానించిన సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు 

జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన లింగమూర్తి ని సన్మానించిన సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు

 

సిద్దిపేట జిల్లా అక్టోబర్ 17(ప్రజాక్షేత్రం):సిద్దిపేట ఆడిటోరియం జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా టి. పీ. సీ. సీ సభ్యులు కేడం లింగమూర్తి ప్రమాణ స్వీకారం చేసి నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్బంగా ప్రముఖ సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో విపంచి ఆడిటోరియంలో వారి అభినందన సభలో కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మండలాలలో ఉన్న గ్రంథాలయాలలో విద్యార్థులకు, నిరుద్యోగులకు పోటి పరీక్షలకు గ్రూప్ 1,2, కానిస్టేబుల్, డీ ఎస్సి, ఏస్ ఐ, సిద్ధమవ్వడానికి అవసరమయే పుస్తకాలను అందుబాటులో ఉంచాలని, కొన్ని గ్రంథాలయాల్లో మౌలిక సదుపాయాలు త్రాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీ గొడ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు పంజాల సత్యనారాయణ గౌడ్, రమేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts