Praja Kshetram
తెలంగాణ

మూతపడ్డ పల్లె దావాఖాన

మూతపడ్డ పల్లె దావాఖాన

 

-వైద్య సేవలు గ్రామ పంచాయతీలో.

-పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్న వైనం.

-రూ.9 లక్షల ప్రజాధనంతో నిర్మించినా…

సేవలు అందించడంలో పూర్తిగా విఫలం.

-ఊరికి దూరంగా ఉంది, పాములు వస్తున్నాయి మాకు ఇబ్బంది అవుతుంది… ఎంపీహెచ్ఏ.

-వాడుకలోకి తేవాలంటున్న గ్రామస్తులు.

పెద్దేముల్ అక్టోబర్ 17(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండల పరిధిలోని “ఘాజీపూర్” గ్రామానికి సంబంధించిన పల్లె దవాఖాన గత కొన్ని నెలల నుండి సేవలు అందించలేక వృధాగా మారింది. దీంతో దవాఖాన పరిసరాలు మొత్తం పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. కేవలం జాతీయ పండగలు ఆగస్టు 15 కు, మరియు జనవరి 26 రోజున జెండా ఎగరేసి దవాఖానకు తాళం వేసి వెళ్ళిపోతారు అంటున్న స్థానికులు. పేద, ధనిక అనే బేధం లేకుండా, ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో… ప్రభుత్వం ప్రజాధనంతో…పల్లె దావాఖాన లను నిర్మించింది. ప్రజలకు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఏ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర కో..నాటు వైద్యుల దగ్గరకో వెళ్లకుండా, మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి పల్లెలో పల్లె దావాఖాన లను నిర్మించింది. గ్రామాలలో తరచుగా పాము కాటు, కుక్క కాటు, వైరల్ ఫీవర్, చిన్నచిన్న గాయాలతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటూ… సుదూర ప్రాంతాలలో ఉన్న ఆసుపత్రులకు వెళ్తుంటారు. ఇలాంటి సమస్య ఉండకూడదనే ఆలోచనతో ప్రభుత్వం పల్లె దవాఖానలు నిర్మించింది. పల్లె ప్రజలకు గ్రామంలోనే మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో 2014లో అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం పల్లె దవాఖాన లను నిర్మించింది. ఇక్కడే అవసరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలకు రక్త నమూనాలను సేకరించి డయాగ్నోస్టిక్ సెంటర్ కు పంపిస్తారు. అక్కడ నుండి వచ్చిన ఫలితాల ఆధారంగా వైద్యులు… రోగులకు చికిత్స అందిస్తారు. ప్రాథమిక దశలోనే, వ్యాధి తీవ్రత పెరగకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావించి పల్లె దవాఖానలను ఏర్పాటు చేశారు.కానీ ఇందుకు భిన్నంగా ఘాజీపూర్ గ్రామంలోని పల్లె దావాఖాన ను గ్రామపంచాయతీ కార్యాలయంలో కొనసాగిస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. వారానికి ఒకరోజు గ్రామ పంచాయతీలో వైద్య సేవలను అందించి చేతుల దులిపేసుకుంటున్నారు.. అంటున్న గ్రామ ప్రజలు.

*నర్సు బాయ్ ఎంపీహెచ్ఏ:*

పాములు వస్తున్నాయి, దవాఖాన దూరంగా ఉంది అంటూ నర్సు బాయ్ సమాధానమిచ్చారు. గతంలో చాలా సందర్భాల్లో ఈ సమస్యను పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లిన ఎవరు కూడా పట్టించుకోలేదు అని ఎంపీహెచ్ఏ నర్సు బాయ్ అన్నారు.

*ఘాజీపూర్ గ్రామస్తులు:*

గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయడం వల్ల సరైన సేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు.మూతపడిన పల్లె దవాఖానను అందుబాటులోకి తీసుకురావాలని, మరియు సరిపడా సిబ్బందిని నియమించి… నిత్యం ఆసుపత్రిలో సేవలు అందించేలా చూడాలని, తద్వారా మాకు మేలు జరుగుతుంది అని గ్రామస్తులు అన్నారు. అధికారులు స్పందించి వెంటనే మూతపడిన పల్లె దవాఖానను తెరిపించాలని అధికారులను కోరారు.

Related posts