Praja Kshetram
జాతీయం

కాటేసిన పామును తీసుకొని ఆసుపత్రికి వచ్చిన పేషెంట్

కాటేసిన పామును తీసుకొని ఆసుపత్రికి వచ్చిన పేషెంట్

 

హైదరాబాద్ అక్టోబర్ 17(ప్రజాక్షేత్రం):ఓ వ్యక్తి కాటేసిన పామును మెడలో వేసుకుని ఆస్పత్రికి వచ్చిన ఘటన వైరల్ గా మారింది. దీంతో డాక్టర్లు రోగులు వణికిపోయారు. విషపూరిత పాము కాటుకు గురైన ఓ వ్యక్తి చేసిన పనికి వైద్యులతోపాటు రోగులను భయాందోళనకు గురిచేసింది. తనను ఏ పాము కాటు వేసిందో వైద్యులకు చూపేందుకు, కరిచిన ఆ సర్పాన్ని ప్రకాశ్‌ మండల్‌ అనే వ్యక్తి ఆస్పత్రికి తీసుకురావడం కలకలం రేపింది. బీహార్ రాష్ట్రంలోని భాగల్‌ పూర్ జిల్లాలో మీరాచాక్ గ్రామానికి చెందిన ప్రకాశ్‌ మండల్‌కు ప్రపంచంలోనే అత్యంత విషపూరిత పాముల్లో ఒకటైన రక్తపింజర ఎడమ చేతి బొటనవేలుపై కాటు వేసింది. వెంటనే పాము నోటిని గట్టిగా అదిమిపట్టుకున్న ప్రకాశ్‌, జేఎల్‌ఎన్‌ఎం ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు. అక్కడ రోగులు, ఆస్పత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. మంచంపై ప్రకాశ్‌ను పడుకోపెట్టినా, అతడు పామును వదల్లేదు. వైద్యులు సలహా మేరకు కొందరు సాహసం చేసి ఆ పామును గోనె సంచిలో బంధించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ప్రకాశ్‌ మండల్‌కు చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ ప్రతీక్ తెలిపారు.

Related posts