Praja Kshetram
తెలంగాణ

దోమల నివారణకు పైరత్రం స్ప్రే

దోమల నివారణకు పైరత్రం స్ప్రే

మాక్లూర్ అక్టోబర్ 18(ప్రజాక్షేత్రం):మాక్లూర్ మండలంలోని చిక్లి గ్రామం లో మలేరియా యూని ట్‌ అధికారి ఆధ్వర్యంలో దోమల నివారణ కు పైరత్రం పిచికారీ చేశారు. అనంతరం డెంగీ వ్యాధి సోకిన వ్యక్తి ఇంటి పరిసరాలు పరిశీలించి వ్యాధి గల కారణాలు తెలుసుకున్నారు.డ్రైనేజీల్లో మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో దుర్వాసనతో పాటు దోమలు ఉండటంతో డెంగ్యూ వ్యాధి వ్యాపించినట్లు గుర్తించారు.ఈ సందర్భంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వెంకటేశం మాట్లాడుతూ… సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నందున దోమకాటుకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని, జ్వరాలు వస్తే వెంటనే రక్తపరీక్షలు చేయించుకోవాలన్నారు. డెంగ్యూ జ్వరం నివారణ మన ఇంటి నుంచే జాగ్రత్తలు పాటించాలని అన్నారు. గ్రామంలో సాయంత్రం 7గంటలు నుండి 8గంటల సమయంలో పాగింగ్ స్ప్రే చేయించాలని పంచాయతీ సెక్రెటరీకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, సూపర్వైజర్స్ , ఆశ వర్కర్స్, పంచాయతీ సిబ్బంది.

Related posts