Praja Kshetram
తెలంగాణ

ప్రజా శాంతికి విఘాతం కలిగించరాదు.. ఎస్ఐ గిరి

ప్రజా శాంతికి విఘాతం కలిగించరాదు.. ఎస్ఐ గిరి

 

పెద్దేముల్ అక్టోబర్ 18(ప్రజాక్షేత్రం):ప్రజా శాంతికి ఎవ్వరు కూడా విఘాతం కలిగించరాదు అని ఎస్ఐ గిరి పేర్కొన్నారు. శుక్రవారం పెద్దేముల్ మండల పరిధిలోని…నాగులపల్లి గ్రామానికి చెందిన మట్ట శ్రీనివాస్, వయస్సు 37 సంవత్సరాలు, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి… గురువారం రాత్రి మద్యం సేవించి, విచక్షణ రహితంగా న్యూసెన్స్ చేయడమే కాకుండా, ప్రజా శాంతికి భంగం కలిగించడంతో.సదరు వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గిరి వెల్లడించారు. ఈ క్రమంలో ఎస్ఐ మాట్లాడుతూ… ప్రజా శాంతికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ నేపధ్యంలో సత్ప్రవర్తన నిమిత్తం శ్రీనివాస్ ను తహసిల్దార్ ముందు హాజరు పరచగా,బైండోవర్ చేసినట్లు..తహసీల్దార్ కిషన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మరొక్కసారి ఈ విధంగా ప్రవర్తిస్తే, రూ.2 లక్షల జరిమానా విధించడంతో పాటు, కేసు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

Related posts