Praja Kshetram
తెలంగాణ

మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు

మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు

 

హైదరాబాద్ అక్టోబర్ 18(ప్రజాక్షేత్రం):హైదరాబాద్‌లోని మియాపూర్‌లో చిరుత కలకలం సృష్టించింది. మియాపూర్‌ మెట్రో స్టేషన్‌కు సమీపంలో శుక్రవారం రాత్రి చిరుత సంచరిస్తూ కనిపించింది. మియాపూర్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో చిరుత సంచరిస్తూ ఉండగా తీసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసి స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Related posts