మండల సర్వేయర్లను సన్మానించిన తహసిల్దార్
నిజామాబాద్ అక్టోబర్ 18(ప్రజాక్షేత్రం):ఆలూర్ మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న కిషన్ నాయక్ బదిలీ పై వెళ్తుండడంతో వారిని తహసిల్దార్ రమేష్ శుక్రవారం సత్కరించారు.అలాగే నూతనంగా ఆలూర్ మండల సర్వేయర్ గా విధులు నిర్వహించడానికి వచ్చిన గోవర్ధన్ కు ఎమ్మార్వో ఆఫీస్ నందు సత్కరించి శుభకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రఫిక్, ఆఫీస్ సిబ్బంది నరేష్, స్వాతి, వసుంధర, గీత, రమేష్, పీరయ్య, భాస్కర్ తదితరులున్నారు.