పెద్దేముల్ ఏవో గా పవన్ ప్రీతమ్
పెద్దేముల్ అక్టోబర్ 19(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండల నూతన వ్యవసాయ అధికారిగా “పవన్ ప్రీతమ్”శనివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఏవోను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శిక్షణ నిమిత్తం 20 రోజుల పాటు అందుబాటులో ఉండకపోవచ్చు, శిక్షణ పూర్తి కాగానే రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, రైతు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా ఏ కాలంలో, ఏ నేలలో…ఎంత మొత్తంలో ఎరువులు, విత్తనాలు వాడలో అవగాహన వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి… రైతులకు అవగాహన కల్పిస్తానని భరోసా ఇచ్చారు. కాగా నూతన వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తానని ఆయన వెల్లడించారు.