జర్నలిస్టుల దాడి పై వినతిపత్రం అందచేత
దమ్మపేట అక్టోబర్ 19(ప్రజాక్షేత్రం):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో నట్టి సుదర్శన్ అనే జర్నలిస్టుపై కొంతమంది వ్యక్తులు దాడి చేయడం వలన విపరీతంగా గాయపడటం జరిగింది. జర్నలిస్ట్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ దమ్మపేట జర్నలిస్ట్ మిత్రులు అందరూ కలిసి స్థానిక దమ్మపేట సబ్ ఇన్స్పెక్టర్ సాయి కిషోర్ రెడ్డి కి,తాసిల్దారి కి వినతి పత్రం అందించడం జరిగింది. ఇటువంటి దాడులు చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని దీనికి ప్రతి ఒక్కరు స్పందించాలని స్థానిక అధికారులను కోరడం జరిగింది,ఈ కార్యక్రమంలో స్థానిక జర్నలిస్టు పాల్గొన్నారు.