Praja Kshetram
తెలంగాణ

రోడ్డు విషయంపై మంత్రి కోమటిరెడ్డి తో చర్చించిన… చేవెళ్ల కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జ్ భీమ్ భరత్

రోడ్డు విషయంపై మంత్రి కోమటిరెడ్డి తో చర్చించిన… చేవెళ్ల కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జ్ భీమ్ భరత్

మొయినాబాద్ అక్టోబర్ 19(ప్రజాక్షేత్రం):చందానగర్ గ్రామం నుండి పెద్ద మంగళారం, మొయినాబాద్, సురంగల్, వెంకటాపూర్ వరకు వెళ్లే రహదారి రోడ్డు విషయంపై ఈరోజు చేవెళ్ల కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జ్ భీమ్ భరత్ ఆధ్వర్యంలో మొయినాబాద్ కాంగ్రెస్ నాయకులు.. రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కలిసి.. రోడ్డు విషయంపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ 15 రోజులలో రోడ్డు మంజూరు అయ్యే విధంగా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మిలి మానేయ, మాజీ ఎంపీటీసీ మాధవ రెడ్డి, జిల్లా నాయకులు జంగారెడ్డి, మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts