కల్లు గీత కార్మికులకు రక్షా కవచ్ కిట్ల పంపిణీ
దమ్మపేట అక్టోబర్ 19(ప్రజాక్షేత్రం):భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి చెందిన పలు కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులకి కాటమయ్య రక్ష కవచ్ కిట్లను కొత్తగూడెం, సింగరేణి గెస్ట్ హౌస్ లో ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహయం రఘురాం రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి. పటేల్, అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారిణి ఇందిర, భద్రాద్రి కొత్తగూడెం ఎక్సైజ్ సూపర్డెంట్ సమక్షంలో సభ్యులకు కిట్లను ఇచ్చారు. ఈ సందర్భంగా దమ్మపేట సొసైటీ సభ్యులు క్రింది అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ముఖ్య అతిథులకు అందజేశారు.
1. యాభై సంవత్సరాలు దాటిన సభ్యులకు పెన్షన్ అమలు చేయాలి.
2. మద్యం షాప్ లలో ఇచ్చే 15% రిజర్వేషన్ ని సొసైటీ లకు ఇవ్వాలి.
3. తెలంగాణ రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ ద్వారా సొసైటీ సభ్యుల పిల్లలకు ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాల కోసం ట్రైనింగ్ ఇవ్వాలి.
4. గీత వృత్తిలో ఉపాధి పెరగాలంటే హిబ్రీడ్ తాటిచెట్లను, ఈత, ఖర్జూరం మొదలగు చెట్లను పెంచటానికి GO నెం 560 ని అమలు చేసి, సొసైటీ లకు భూమి ఇవ్వాలి.
5. తాటి చెట్లను నరికినవారి పై చర్యలు తీసుకునే విధంగా కొత్త చట్టం తీసుకురావాలి.
ఈ కార్యక్రమానికి యార్లగడ్డ సూరి, పానుగంటి లక్ష్మణ్ గౌడ్, యార్లగడ్డ వెంకటాచలం, చిలుకబత్తుల ఏసుబాబు, బలగాని కృష్ణ, మిద్దే లక్ష్మణరావు, మిడతా శ్రీను పాల్గొన్నారు.