Praja Kshetram
తెలంగాణ

గర్భిణికి తప్పని డోలీ మోత

గర్భిణికి తప్పని డోలీ మోత

 

-కర్రీగుడ నుంచి ఐదు కిలోమీటర్లు కాలినడకన గుమ్మకు..

-ఎస్‌.కోట ఆస్పత్రికి తరలింపు.

అనంతగిరి, అక్టోబరు 19 (ప్రజాక్షేత్రం):మారుమూల గ్రామాలకు సరైన రహదారి లేకపోవడంతో గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు. మండలంలోని మారుమూల గుమ్మ పంచాయతీ కర్రీగుడ గ్రామానికి చెందిన బడ్నాయిన రాములమ్మ నిండు గర్భిణి. శనివారం ఉదయం ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడం అంబులెన్స్‌ వచ్చే పరిస్థితి లేదు. దీంతో గర్భిణి భర్త బడ్నాయిన సన్యాసిరావు, మరొకరి సాయంతో రామ్ములమ్మను దట్టమైన అటవీప్రాంతం గుండా ఐదు కిలోమీటర్లు డోలీపై గుమ్మ గ్రామం వరకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి ఆటోలో ఎస్‌.కోట ఆస్పత్రికి తరలించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అధికారులు స్పందించి, రహదారి నిర్మాణానికి కృషిచేయాలని గిరిజనులు వేడుకుంటున్నారు.

Related posts