Praja Kshetram
క్రైమ్ న్యూస్

తహసీల్దార్ నరేష్ అరెస్ట్..

తహసీల్దార్ నరేష్ అరెస్ట్..

-సీఐ వేకటేశ్వర్లు వెల్లడి.

చందుర్తి అక్టోబర్ 19(ప్రజాక్షేత్రం): భూ అక్రమ పట్టా కేసులో బదిలీపై వెళ్లిన ఓ తహసీల్దార్ కటకటాల పాలయ్యాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్ గాండ్ల వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపల్లి గ్రామానికి చెందిన సలేంద్ర మల్లేశం అనే వ్యక్తి చెందిన వ్యవసాయ భూమి సర్వే నంబర్ 104,ఆ 105,ఆ 105ఉ 105 అనే సర్వే నంబర్లో గల భూమిని అదే గ్రామానికి చెందిన సలేంద్ర లక్ష్మి ,వేణు పట్టా మార్పిడి చేయడం జరిగింది. బోయినిపల్లి మండలం అనంత పల్లి గ్రామానికి చెందిన దుర్గయ్య అనే రైతుకు చెందిన నకిలీ డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి పట్టా చేసినట్లుగా తేలడంతో బాధిత రైతు మల్లేశం కోర్టును ఆశ్రయించాడు. దీంతో విచారణ నిమిత్తం స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు విచారణ చేపట్టగా.. నకిలీ ధ్రువపత్రాలతో పట్టా చేసినట్లుగా తెలిసింది. అదేవిదంగా జులై 25, 2024లో అదే వ్యవసాయ భూమిపై అక్రమ పట్టా దారులు రుణం తీసుకున్నట్లుగా తెలిపారు. దీంతో అక్రమ పట్టా చేసిన తహశీల్దార్ ను శనివారం అరెస్ట్ చేసి, వేములవాడ కోర్టులో హాజరు పరిచినట్లుగా సీఐ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ పట్టా చేసుకున్న వారిపై త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Related posts