ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు స్టేషనరీ వితరణ
షాబాద్ అక్టోబర్ 19(ప్రజాక్షేత్రం):స్ఫూర్తి డేషన్వి య్యూరి శ్రీవ్యల్, ఆధ్వర్యంలో ప్రవాస భారతీయుడు శశి ప్రకాష్ ఆర్థిక సహాయంతో షాబాద్ మండలంలోని ప్రాథమిక పాఠశాల మన్మర్రిలో చదువుకునే విద్యార్థులందరికీ ఎగ్జామ్ ప్యాడ్స్,నోటు పుస్తకాలు, పెన్నులు,పెన్సిల్లు,షార్ఫ్ నర్స్, ఎరాజర్, స్కేల్స్, కంబాక్స్, పలకలు తదితర విద్యసామాగ్రిని పేరెంట్ టీచర్ సమావేశంలో విద్యార్థులకు వితరణ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్ మౌర్య, మరియు ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ భానుప్రకాష్ మాట్లాడుతూ… సోమవారం నుండి జరగబోయే సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలకోసం విద్యార్థులందరూ చక్కగా చదువుకొని మంచి మార్కులు సాధించాలని, వీటితోపాటు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల కోసం ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని, చదువుతోపాటు ఆటపాటల్లో కూడా రాణించాలని, విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహించడానికి దాతల సహకారంతో విద్యార్థులకు కావలసినటువంటి విద్యా సామాగ్రిని అందించడం జరుగుతుందని తెలియజేస్తూ, విద్యార్థులు ఇంటిదగ్గర చదువుకోవడానికి తల్లిదండ్రులు చక్కటి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలని,ఇంట్లో ప్రత్యేకమైన స్టడీ కార్నర్ ఏర్పాటు చేసి ఇంటిదగ్గర నిరంతర విద్యాభ్యాసం జరిగేలా చూడాలని,పిల్లలకు మంచి చెడుల గురించి తెలియజేస్తూ సెల్ ఫోన్ కు దూరంగా ఉంచి వారి ప్రవర్తన ఎప్పటికప్పుడు గ్రహిస్తూ,వారి బంగారు జీవితానికి బాల్య దశ నుండే బాటలు వేయాలని తెలపడం జరిగింది. ఈ సమావేశంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోఉపాధ్యాయులు వెంకటమ్మ,మాజీ ఎస్ఎంసి చైర్మన్ వెంకటేష్ విద్యార్థుల తల్లిదండ్రులు రవి, మల్లేష్, సురేష్, యూసుఫ్, బిక్షపతి, శంకర్,రాజు,రామ్ చందర్, శంకరయ్య, లక్ష్మి, నీలవేణి, యాదమ్మ, రాధిక, నాజియా, ప్రమీల, హరిత, సరిత తదితరులు పాల్గొన్నారు.