Praja Kshetram
తెలంగాణ

వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి : టిడబ్ల్యూజేఎఫ్

వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి: టిడబ్ల్యూజేఎఫ్

-జన్నారంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు

జన్నారం అక్టోబర్ 20(ప్రజాక్షేత్రం):వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. ఆదివారం జన్నారం మండల కేంద్రంలోని పీఆర్టీయూ భవన్లో టీడబ్ల్యూజేఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సోమయ్య మాట్లాడుతూ.. వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలతో పాటు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలన్నారు. అక్కడేషన్ కార్డ్, బస్సు పాస్ తో సహా, రైల్వే పాస్ హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. వాటిని సాధించుకోవాలంటే యూనియన్ బలోపేతంగా ఉంటేనే హక్కులను సాధించుకోవచ్చు అన్నారు. ఆదిలాబాద్ నిర్మల్ ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలకు వివిధ పత్రిక చెందిన జర్నలిస్టులు టిడబ్ల్యూజేఎఫ్ లో చేరారు. సంఘాన్ని బలోపేతం చేయాలని వారికి సూచించారు. కార్యక్రమములో టిడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు తోట్ల మల్లేష్ యాదవ్ మధు, దయాకర్, సుధీర్ కుమార్, తదితర యూనియన్ నాయకులు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Related posts