Praja Kshetram
తెలంగాణ

బయ్యక్కపేట బాలుర ఆశ్రమ పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి సీతక్క

బయ్యక్కపేట బాలుర ఆశ్రమ పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి సీతక్క

 

తాడ్వాయి అక్టోబర్ 20(ప్రజాక్షేత్రం):మండలంలోని బయ్యక్కపేట ప్రభుత్వ బాలుర ఆశ్రమ పాఠశాలను ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆకస్మితంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వంట వండుతుండగా అక్కడికి వెళ్లి, వంట పదార్థాలను పరిశీలించారు. అనంతరం విద్యార్ధులతో కాసేపు వాలి బాల్ ఆట ఆడారు. వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది అని, ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నతమైన చదువులు చదివి, మీ తల్లీ తండ్రులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. కష్ట పడి చదువుతే మంచి భవిష్యత్ ఉంటుందని హాస్టల్ లో ఏ సమస్య ఉన్నా నా (మంత్రి) దృష్టికి తీసుకురావాలని, లేదా సంభందిత అధికారుల దృష్టికి తీసుకు పోవాలని తెలిపారు. వెంటనే సమస్య పరిష్కరిస్తామని అన్నారు. విద్యార్థులకు మంచి పౌష్టిక వేడివేడి ఆహారం అందించాలని, వంట వండే వాళ్ళు శుభ్రత పాటించాలని తెలిపారు. ఉపాధ్యాయులు సమయపాలన కూడా పాటించాలని తెలిపారు. మంచి ఆహారం అందించుకున్న, సమయపాలన పాటించకున్నా కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, ములుగు జిల్లా గ్రంథాలయ చైర్మన్ బాణోత్ రవి చందర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్, రాష్ట్ర, జిల్లా, బ్లాక్ మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts