Praja Kshetram
జాతీయం

ఫుడ్ పాయిజన్..200 మందికి అస్వస్థత

ఫుడ్ పాయిజన్..200 మందికి అస్వస్థత

 

అస్సాం అక్టోబర్ 20(ప్రజాక్షేత్రం):తల్లి చనిపోయిన రోజున 10 మందినీ పిలిచి భోజనం పెట్టాలనుకున్నాడు. కానీ.. అనూహ్యంగా ఆ ఆహారం తిన్నవారంతా అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన అస్సాంలోని గోలాఘాట్ జిల్లా, పాస్ ఘోరియా గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రదీప్ గొగోయ్ అనే వ్యక్తి తన తల్లి స్మారకంగా శనివారం (అక్టోబర్ 19) ఒక కార్యక్రమాన్ని నిర్వహించాడు. వచ్చిన బంధువులు, స్నేహితులకు జల్పాన్ (పఫ్డ్ రైస్, క్రీమ్డ్ స్నాక్స్) పెట్టాడు. వాటిని తిన్న అతిథులు కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే 200 మందిని ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. పేషంట్లను పరిశీలించిన వైద్యులు ఫుడ్ పాయిజన్ జరిగినట్లు తెలిపారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన చికిత్స కోసం జోర్హాట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. బాధితుల్ని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే బిస్వజిత్ పుకాన్ పరామర్శించారు. ఫుడ్ ఇన్ స్పెక్టర్, అధికారులు ఫుడ్ పాయిజనింగ్ కు గల కారణాలపై విచారణ చేస్తున్నారని తెలిపారు.

Related posts