అ’పూర్వ’ సమ్మేళనం…వెల్లివిరిసిన ఆనందం…!!
-ఘనంగా ఎల్లకొండ 2001-02 టెన్త్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం…!!
-విద్యార్థుల ఉన్నతే గురువులకు ఆనందం…!!
-పూర్వ విద్యార్థులకు సూచించిన ఆనాటి ఉపాధ్యాయులు…!!
వికారాబాద్ ప్రతినిధి అక్టోబర్ 20(ప్రజాక్షేత్రం):ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి చిన్ననాటి నుండి ఒకే విద్య సంస్థలో చదివిన పూర్వ విద్యార్థులు 22 సంవత్సరాల తర్వాత ఆత్మీయ వేదికపై కలుసుకున్నారు.ఈ సందర్భంగా గురువారం త్రిపుర రిసార్ట్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఎల్లకొండ ఉన్నత పాఠశాలలో 2001-02 జ్ఞాపకాలను అప్పటి టెన్త్ క్లాస్‌లో వీరు చేసిన అల్లరి చేష్టలను, ఉపాధ్యాయులతో కలసి, అప్పటి ఆట, పాటలను వారు గుర్తు చేసుకుంటూ ఆనందోత్సవాలతో గడిపారు.ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకరితో ఒకరు చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వారు ఆలింగనం చేసుకుంటూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా తమకు పాఠాలు నేర్పిన ఆనాటి ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు మేళ, తాళాలు, చప్పుళ్లతో సాంప్రదాయ పద్ధతిలో సభా స్థలానికి ఆహ్వానించి ఉపాధ్యాయులకు పుష్ప గుచ్చాలు అందజేస్తూ వేదిక పైకి పిలిచి శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమాని ఉద్దేశించి ఉపాధ్యాయులు మాట్లాడుతూప్రస్తుత సమాజంలో నైతిక విలువలు, సమాజ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. తమ పిల్లల చదువుపై ఒత్తిడీ చేపట్టవద్దని అభిప్రాయం మేరకే ముందుకు సాగితే విజయం తధ్యమని చెప్పారు. వివిధ స్థాయిల్లో అందరూ పనిచేస్తున్నప్పటికీ 22 సంవత్సరాల తర్వాత ఒకే చోట కలుసుకోవడం శుభపరిణామం అని అన్నారు.విద్యార్థులందరూ ఒక చారిటీని ఏర్పాటు చేసు కొని సమాజసేవగా సహాయం తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు రమణకుమారి, అంజయ్య, హిమామ్,రామకృష్ణారెడ్డి,రాజు,ప్రతాప్,మనోహర్,బాల కుమార్, వెంకటేశ్వర్లు, మల్లికార్జున్,,ఆనాటి పూర్వ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.