Praja Kshetram
తెలంగాణ

కాలి కుర్చీతో దర్శనమిస్తున్న పెద్దేముల్ జీపీ..!

కాలి కుర్చీతో దర్శనమిస్తున్న పెద్దేముల్ జీపీ..!

-ఇంకెన్నాళ్లు ఈ గోస

-ఇంత పెద్ద గ్రామ పంచాయతీకి ఇన్చార్జి కార్యదర్శిఆ..?

-ఈ నెల 3వ తేదీ నుంచి కార్యదర్శి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటునామంటున్న గ్రామ ప్రజలు.

-మండల కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంటే పల్లెల్లో ఇంకెలా ఉంటుందోనని వాపోతున్నారు.

-శాశ్వత కార్యదర్శిని నియమించాలని గ్రామ ప్రజల ఆవేదన.

పెద్దేముల్ అక్టోబర్ 20(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండల కేంద్రంలో, గ్రామ పంచాయతీ కార్యదర్శి లేక.. కాలి కుర్చితో దర్శనమిస్తున్న పంచాయతీ కార్యాలయం.ఇదివరకు మారేపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి నరసింహారెడ్డికి, పెద్దేముల్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా.. అదనపు బాధ్యతలు అప్పగించడంతో, ఇన్చార్జిగా కొనసాగారు. ఈ క్రమంలో ఆయన ఈ నెల మూడవ తేదీ నుండి సెలవుల పై వెళ్లగా, దాదాపు 17 రోజుల నుండి నేటి వరకు పెద్దేముల్ గ్రామ పంచాయతీలో కార్యదర్శి లేక, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మరణ ధ్రువీకరణ పత్రం, బర్త్ సర్టిఫికెట్ల కోసం, ఆధార్ కార్డు మార్పు చేర్పుల కోసం, కళ్యాణ లక్ష్మి, పెన్షన్ల కు సంబంధించి తదితర అవసరాల నిమిత్తం గ్రామ పంచాయతీకి వెళ్తే, గ్రామ పంచాయతీలో సెక్రెటరీ లేకపోవడంతో, విసుకు చెంది ఇంకెన్నాళ్లు మాకు ఈ గోస అని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా సగటు మనిషి నిత్యజీవితంలో ఆధార్ కార్డు అనేది ప్రామాణికం అయ్యింది.కాగా ఆధార్ కు సంబంధించి సమస్యలు అధికంగా ఉండడంతో పంచాయతీ కార్యదర్శి సంతకం అనివార్యం అయ్యింది. ఈ నేపథ్యంలో ఇన్చార్జి కార్యదర్శి, శాశ్వత కార్యదర్శి.. లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత పెద్ద మండల కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితి దాపరించింది అంటే… పల్లెటూర్లలో ఇంకెలా ఉంటుందోనని వాపోతున్నారు. తక్షణమే పెద్దేముల్ ప్రధాన గ్రామ పంచాయతీకి, శాశ్వత కార్యదర్శిని నియమించి, మా సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

Related posts