Praja Kshetram
తెలంగాణ

నిజామాబాద్ లో ప్రభుత్వ భూములపై కబ్జాలకు పాల్పడుతున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

నిజామాబాద్ లో ప్రభుత్వ భూములపై కబ్జాలకు పాల్పడుతున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

-అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్.

నిజామాబాద్ అక్టోబర్ 20(ప్రజాక్షేత్రం):నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ భూములు,ఫారెస్ట్ భూములు, రోడ్లు, పార్క్ స్థలాలు అక్రమణకు, కభ్జాకు గురవుతున్నాయని వాటి రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విలువైన భూములు అన్యాక్రాంతం కు గురవుతుంటే అధికారులు చోద్యం చూడటం సిగ్గు చేటని అన్నారు. 12డివిజన్ లో ప్రభుత్వ భూములు,ఫారెస్ట్ భూములు కబ్జాకు గురవడం అక్రమార్కులు పేదలకు అట్టి భూములు అమ్మడం లాంటి ఘటనలు చూస్తుంటే కబ్జా దారులు ఏవిధంగా రెచ్చిపోతున్నారో అర్థం అవుతుంది అని పేర్కోన్నారు. కబ్జా దారుల పట్ల అలసత్వం వహించకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. లేని పక్షంలో భూముల రక్షణ కు ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తామని దుడ్డు గంగాధర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు శివ రాజు,మోజీరాం లు ఉన్నారు.

Related posts