ఎలక్ట్రిక్ బైక్ పేరుతో ఘరానా మోసం
-ఏడిఎంఎస్ బ్రోకర్లకు బోల్తా పడుతున్న ప్రజలు
హైదరాబాద్ అక్టోబర్ 21(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏడిఎంఎస్ ఎలక్ట్రికల్ బైక్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న సంఘటనలపై పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. 15000 రూపాయలు కట్టి, ఆరుగురిని చేర్పిస్తే బైక్ అందిస్తామని చెప్పి ప్రజలను ఆర్థికంగా బోల్తా కొట్టిస్తున్న బ్రోకర్ల తప్పుడు మాటలు, కేటుగాళ్ల వైఖరి ప్రజలను తీవ్రంగా నష్టపరిచింది.
-మోసపోయిన లక్షలాది ప్రజలు
యావత్ తెలంగాణలో లక్షలాది మంది ఈ మోసానికి బలై, 15,000 చెల్లించినప్పటికీ, బైకులు తీసుకోక ఆరుగురిని చేర్పించలేక ఉంది నిరాశాయి మోసపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. చాలామంది ప్రజలు నిరాశలో మునిగిపోయారు. అఖిల భారతీయ ఎలక్ట్రానిక్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజాలు, గత రెండు నెలలుగా 1000 మంది బాధితులను కలిసిన జర్నలిస్టుల సంఘం మోసాలను బయటపెట్టింది.
-ఎలక్ట్రిక్ బైక్ మోసం
80 వేల రూపాయల విలువైన బైకులను లక్ష రూపాయలకు అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్న ఏడిఎంఎస్ సంస్థ వారి బ్రోకర్లు, నాణ్యతలేని బైకులు అందిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు.
-ప్రజల ఆందోళన
ఈ మోసపూరిత చర్యలపై ప్రభుత్వమే చొరవ తీసుకుని, ఏడిఎంఎస్ సంస్థను వెంటనే మూసివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ , మోసాలకు ఎగబడుతున్న బ్రోకర్లను కట్టడి చేయాలని ప్రజలను అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు తిరగబడి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఏడిఎంఎస్ సంస్థను తెలంగాణలో వెంటనే మూసివేరాని ఆదేశాలు జారిచేలాన్ని ప్రజలు కోరుతున్నారు. ఎడిఎంఎస్ సంస్థతో కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోయారని దీనిపై వెంటనే విచారణ జరిపించి నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించి , ఇలాంటి దొంగ సంస్థ లాంటివి పురావృత్తం కాకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ, సూచనలు ఇవ్వాలని అది ప్రభుత్వ బాధ్యత అని , కేంద్ర రాష్ట్ర రాష్ట్రాలపై ఉందని అఖిల భారతీయ ఎలక్ట్రానిక్ జర్నలిస్టు యూనియన్ పేర్కొంది.