మనవరాలి సంగీత్‌లో డ్యాన్స్ ఇరగదీసిన మాజీ మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్ అక్టోబర్ 21(ప్రజాక్షేత్రం):మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత చామకూర మల్లారెడ్డి ఎక్కడ ఉన్నా సరే సందడిగా ఉంటుంది. తన మాటలతో, తన యాటిట్యూడ్‌తో చుట్టూ ఉన్నవాళ్లను ఎప్పుడూ సరదాగా ఉంచుతారు. ఆయన కూడా అంతే జోష్‌తో ఉంటారు. అలాంటి మల్లారెడ్డి ఇప్పుడు తన మనమరాలి సంగీత్ ఫంక్షన్‌లో ఫుల్ ఎంజాయ్ చేసేశారు. అంతేకాకుండా డీజే టిల్లు సాంగ్‌కు మాస్ స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీశారు. చామకూర మల్లారెడ్డి మనమరాలు, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురి వివారం ఈ నెల 27వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి సంగీత్ నిర్వహించారు. ఇందులో మల్లారెడ్డి కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. అయితే ఈ సంగీత్‌లో మల్లారెడ్డి వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు అట్లుంటది మన మల్లారెడ్డితో అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరైతే 75 ఏళ్ల వయసులోనూ అంత ఎనర్జీతో స్టెప్పులు వేయడం చూసి షాకైపోతున్నారు.
డాన్స్ ఇరగదీసిన మల్లారెడ్డి
తన మనవరాలు, మర్రి రాజశేఖర్ కుమార్తె సంగీత్ ఫంక్షన్లో డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్స్‌తో డాన్స్ ఇరగదీసిన మల్లారెడ్డి.