Praja Kshetram
తెలంగాణ

తెరుచుకున్న పల్లె దవాఖాన

తెరుచుకున్న పల్లె దవాఖాన

 

పెద్దేముల్ అక్టోబర్ 21(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండల పరిధిలోని ఘాజీపూర్ గ్రామానికి సంబంధించిన పల్లె దావాఖానను ఎట్టకేలకు తెరిచి సేవలందిస్తున్నారు. ఈనెల 17వ తేదీన ప్రజాక్షేత్రం దినపత్రికలో “మూతపడ్డ పల్లె దావాఖాన” అనే శీర్షికతో ప్రచురించిన కథనానికి మండల అధికారులు స్పందించి, మూతపడ్డ దవాఖానను తెరుపించి సేవలందిస్తున్నారు. గత కొన్ని నెలల నుండి, పల్లె దావాఖాన సేవలను గ్రామపంచాయతీ కార్యాలయంలో అందించడంతో, సరైన సేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని గ్రామస్తులు తెలుపగా… ప్రజాక్షేత్రం దినపత్రిక అధికారుల దృష్టికి తీసుకెళ్ళింది.దీంతో అధికారుల స్పందించి మూత పడిన పల్లె దవాఖాన.. పరిసర ప్రాంతాలను పూర్తిగా శుభ్రం చేసి సోమవారం నుండి ప్రజలకు పల్లె దవాఖానలోనే సేవలు అందిస్తున్నట్లు ఎంపిహెచ్ఎ నర్సు బాయ్ పేర్కొన్నారు.

Related posts