Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

గిరిజనులను ఇబ్బందులపెడితే చర్యలు తప్పవు

గిరిజనులను ఇబ్బందులపెడితే చర్యలు తప్పవు

 

జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ హెచ్చరిక

పాడేరు, అక్టోబర్ 22(ప్రజాక్షేత్రం):జనన, మరణ దృవీకరణ పత్రాలు జారీకి నోటరీ చేయాలని ఇబ్బందులు పెడితే రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ১. ఎస్. దినేష్ కుమార్ హెచ్చరించారు.రెవెన్యూపరంగా జారీ చేసే దృవపత్రాలకు అఫిడివిట్లు తో పని లేదన్నారు. అఫిడివిట్లు అడిగితే తీవ్రంగా పరిగణించిన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లాలోని తాహశీల్దారులు, మండల సర్వేయర్లుతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనన దృవీకరణ, మరణ దృవీకరణ పత్రాలు, కుటుంబ సభ్యుల దృవ పత్రాలు, మ్యుటేషన్లుకు అఫిడివిట్లు అవసరం లేదని స్పష్టం చేసారు. ప్రజలకు అవసరమైన దృవ పత్రాలు జారీ చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపైనే ఉందన్నారు. 4110 గ్రామాల్లో ని 2.71 లక్షల కుటుంబాలను సర్వే చేయగా 16 వేల మందికి ఆధార్ కార్డులు లేవని ఆధార్ కార్డులు లేనివారికి ఆధార్ కార్డులు జారీ చేయడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భూమలు రీసర్వే చేసి సర్వే నంబర్లును, కచ్చితమై భూ విస్తీర్ణాన్ని గుర్తించిన నమోదు చేయాలని చెప్పారు. సర్వే ప్రక్రియ చేసేటప్పుడు ముందుగా గ్రామాలకు సమాచారం అందించాలని చెప్పారు. తాహశీల్దారులు ఎక్కడో చెట్టుకింద కూర్చుని సర్వే చేయకుండా ఇంటింటికి వెళ్లి క్షేత్ర స్థాయిలో సర్వే నిర్విహించాలని ఆదేశించారు. భూముల సర్వే సక్రమంగా చేయకపోతే వి.ఆర్.ఓలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వే నంబర్లను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, అసైన్డ్ భూములను పక్కాగా గుర్తించాలని స్పష్టం చేసారు. రెవెన్యూ చట్టాలను, ప్రభుత్వ జీవోలను పకడ్బందీగా అమలు చేయాల్సి బాధ్యత రెవెన్యూ అధికారులపైనే ఉందన్నారు. భూముల రికార్డులను సక్రమంగా ప్యూరిఫికేషన్ చేయాలని చెప్పారు. వెబ్ ల్యాండ్ భూముల వివరాలను నమోదు చేయాలని అన్నారు. వి. ఆర్. ఓలకు కుటుంబ దృ వీకరణ పత్రాలు జారీపై తగిన శిక్షణ అందించాలన్నారు. జిల్లాలో 86 నీటి సంఘాలు ఉన్నాయని చెప్పారు. నంబరు 21 నీటి సంఘాలకు ఎన్నికలను నిర్వహించాలని సూచించారు. నీటి సంఘాల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించ వలసిన బాధ్యత తాహశీల్దారులపైనే ఉందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ్, సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్ డి. ఆర్. ఓ. బి. పద్మావతి, పి.యం.యు ప్రోగ్రాం అధికారి రాంగోపాల్, సర్వే అధికారులు, 22 మండలాల తాహశీల్దారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts