బిగ్ బాస్ లో ఉన్న గంగవ్వకి గుండె పోటు.. షాక్‌లో అభిమానులు..!
హైదరాబాద్ అక్టోబర్ 22(ప్రజాక్షేత్రం):యూట్యబూర్‌గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ పలు సినిమాలలో కూడా నటించి మెప్పించింది… బిగ్ బాస్ సీజన్ 4 లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. కొన్ని రోజుల పాటు హౌజ్‌లో బాగానే సందడి చేసిన గంగవ్వ బిగ్ బాస్ హౌస్ ఎయిర్ కండిషనింగ్ కారణంగా చాలా ఇబ్బందులు పడింది. సమయం సందర్భం లేకుండా టాస్క్‌లు ఇస్తుండడంతో ఆమె ఆరోగ్యం చాలా దెబ్బతింది. దీంతో మధ్యలోనే బయటకు వచ్చేసింది. ఇక ఇప్పుడు సీజన్8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజే అవినాష్ తో కలిసి ఒక గేమ్ చాలా అద్భుతంగా ఆడింది. అబ్బో అవ్వ పర్వాలేదే.. ఈ వయసులో కూడా ఇరగదీస్తుంది కదా అని అందరు అనుకున్నారు. అయితే గంగవ్వకు అర్థరాత్రి గుండెపోటు వచ్చిందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బిగ్ బాస్ రివ్యూవర్స్ కొందరు గంగవ్వకు గుండెపోటు రావడంతో తోటి కంటెస్టెంట్స్ తీవ్ర ఆందోళకు గురయ్యారని, ముఖ్యంగా విష్ణుప్రియ చాలా టెన్షన్ పడిందని చెప్పుకొచ్చారు. ఇక గంగవ్వకు వైద్యం అందించేందుకు వైద్యుల బృందం బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించినట్టు కూడా వార్తలు వస్తుండడతో అభిమానులు భయాందోళనలకి గురవుతున్నారు. అయితే ఇదంతా ఫ్రాంక్ అని కొందరు చెబుతున్నారు.బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా గంగవ్వ హార్ట్ అటాక్ వచ్చినట్లు తోటి కంటెస్టెంట్స్ కి ఝలక్ ఇచ్చిందట. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. గంగవ్వ హౌజ్‌లోని కంటెస్టెంట్స్ తో అప్పుడప్పుడు సరదా ముచ్చట్లు ఆడడం మానం చూశాం.. అయితే మొదటి రోజు ఆమెలో కనిపించిన జోష్ మళ్లీ కనిపించలేదు. హౌస్ మేట్స్ కూడా వయసులో పెద్దావిడ కాబట్టి ఆమెతో టాస్కులు ఆడించి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సైలెంట్ గా పక్కన కూర్చొబెడుతున్నారు. మరి ఈమెకి ఓట్స్ బాగానే పడుతున్నా కూడా ఎన్ని రోజులు ఆ హౌజ్‌లో ఉంటుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇక గంగవ్వ వయసు కేవలం 62 యేళ్లు మాత్రమే కాగా, ఈ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున కన్నా చిన్నదేనట. నాగ్ వయసు 65 ఏళ్లు. ఒక రకంగా చెప్పాలంటే గంగవ్వ కంటే నాగార్జున మూడేళ్లు వయసులో పెద్ద. సీజన్ 4 నుండి గంగవ్వ బయటకు వచ్చిన తర్వాత నాగార్జున ఆమెకు ఇల్లు కట్టుకోవడానికి కొంత డబ్బు ఇచ్చిన విషయం తెలిసిందే.