తెలంగాణ సాంస్కృతి లో ‘లగ్గం’ సినిమా ప్రత్యేకత
-నిర్మాత వేణుగోపాల్ రెడ్డి
శంకర్ పల్లి, అక్టోబర్ 22(ప్రజాక్షేత్రం):తెలంగాణ సాంస్కృతి లో లగ్గం సినిమా ప్రత్యేకత తో కూడుకొని ఉంటుందని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సుబిషి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ చెప్పాల దర్శకత్వంలో నిర్మించిన లగ్గం సినిమా ఈనెల 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రమోషన్లతో సినిమా ప్రివ్యూ సినిమా చుసిన వాళ్ళు ఈ కాలంలో ఇంటిల్లిపాది కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా అని హిట్ టాక్ రావడంతో ఈ లగ్గం చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు, ఈ చిత్ర నిర్మాత సూభిషి గ్రూప్ అఫ్ ఎండీ వేణుగోపాల్ రెడ్డి సుబిషి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ లగ్గం సినిమాను నిర్మించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మోకిలలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి లో లగ్గం ఎలా జరుగుతుందో దర్శకులు రమేష్ చెప్పాలా మన కళ్ళకు కట్టినట్టు చూపించారు అని అన్నారు. ప్రతి ఆడపిల్ల తండ్రి, వ్యవసాయదారుడు, తప్పక చూడాల్సిన సినిమా ఇది అని అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారు వారి కష్టాలను కూడా ఈ సినిమా లో ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. ఈ చిత్రం ఏషియన్ సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈనెల 25న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉందని ఇప్పటికే చిత్రం విడుదలకు ముందే టిక్ టాక్ రావడం సంతోషం కలిగిస్తుందని తెలిపారు.