Praja Kshetram
తెలంగాణ

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన లైన్ ఇన్‌స్పెక్టర్‌

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన లైన్ ఇన్‌స్పెక్టర్‌

 

భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 23(ప్రజాక్షేత్రం):విద్యుత్ మీటర్ కనెక్షన్ కోసం లంచం తీసుకుంటూ లైన్ ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో ఓ ఇంటి యజమాని విద్యుత్ మీటర్ కనెక్షన్ కోసం లైన్ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజును సంప్రదించాడు. అందుకు రూ.26,000 లంచం ఇవ్వాలని లైన్ ఇన్‌స్పెక్టర్‌ డిమాండ్‌ చేశాడు. దీంతో చేసేదేమి లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు నాగరాజుకు లంచం ఇస్తుండగా ఏసీబీ సిబ్బంది రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం పాల్వంచ సబ్‌ స్టేషన్‌లో సోదాలు నిర్వహించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ రమేష్‌ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts