చేతి పంపు మరమ్మత్తులు పూర్తి.
పెద్దేముల్ అక్టోబర్ 24(ప్రజాక్షేత్రం):గ్రామపంచాయతీ మల్టీ పర్పస్ కార్మికులకు నాలుగవ రోజు శిక్షణలో భాగంగా, చేతి పంపులకు సంబంధించిన మరమ్మత్తులు, నీటిని అందించే విధానం పైన శిక్షణ అందించారు. దీంట్లో భాగంగా పెద్దేముల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సమీపంలో ఉన్న పురాతన చేతి పంపు బోర్ ను వెలికి తీసి మరమ్మతులు కొనసాగించారు. ఈ క్రమంలో ఇరిగేషన్ ఏఈ అఖిల్ మాట్లాడుతూ… గ్రామానికి ఈ పంపు ద్వారా నీరు అందించేందుకు మరమ్మత్తులు చేశాము అని వెల్లడించారు.
