Praja Kshetram
తెలంగాణ

ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించాలి.. ఆర్ డబ్ల్యూఎస్ ఆంజనేయులు

ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించాలి.. ఆర్ డబ్ల్యూఎస్ ఆంజనేయులు

-80 శాతం వ్యాధులు కలుషిత నీటి వల్లనే సంక్రమిస్తాయి.

-నీటి నాణ్యత ప్రమాణాలు పాటించాలి.

పెద్దేముల్ అక్టోబర్ 24(ప్రజాక్షేత్రం):గ్రామీణ ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు, గ్రామాలలో త్రాగునీరు సరఫరా చేసే సహాయకులకు శిక్షణ అందించాలని ఆర్డబ్ల్యూఎస్ ఆంజనేయులు పేర్కొన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో మల్టీ పర్పస్ కార్మికులకు మంచినీరు అంశం పైన శిక్షణను అందించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ… త్రాగునీటిలో ఫ్లోరైడ్ సమస్య లేకుండా, స్వచ్ఛమైన మంచినీటిని అందించాలని, మంచినీటి సహాయకులకు ఆయన సూచించారు. ప్లోరైడ్ వలన ఎముకలు అరిగిపోయి, ఎముకలలో ఉన్న క్యాల్షియం తగ్గిపోతుంది. తద్వారా కాళ్లు చేతిలు వంకరగా తయారవుతాయని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా వాటర్ ట్యాంక్ ద్వారా నీటిని అందించే పద్ధతులలో.. ఎప్పటికప్పుడు వాటర్ ట్యాంకు కలుషితం లేకుండా, శుభ్రంగా ఉండేందుకు, త్రాగునీటి శుద్ధికరణకోసం, బ్యాక్టీరియాల నిర్మూలన కోసం బ్లీచింగ్ పౌడర్ లాంటి కారకాలను ఉపయోగించాలని అన్నారు. చేతి పంపులు, సింగిల్ ఫేస్ మోటార్ ద్వారా అందించే నీటిలో కలుషితం లేకుండా, స్వచ్ఛమైన నీటిని అందించెందుకు తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. కలుషితమైన నీటి ద్వారా కలరా, డయోరియా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా గ్రామాలలో పారిశుధ్యం పైన కూడా ప్రత్యేక దృష్టి సారించాలని, పారిశుధ్యం సరిగా లేకుంటే, దోమల తీవ్రత పెరిగి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి మరణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుందని అన్నారు. కాబట్టి గ్రామాలలో ప్రధానంగా తాగునీరు పరిశుధ్యం సక్రమంగా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఆంజనేయులు, ఎంపీడీవో జర్నప్పా, ఇరిగేషన్ ఏఈ ఆర్డబ్ల్యూఎస్ అఖిల్, ఎంపీఓ రతన్ సింగ్, మిషన్ భగీరథ ఏఈ ప్రతిభ, మల్టీపర్పస్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Related posts