Praja Kshetram
తెలంగాణ

ఈనెల 25వ తారీకున జరిగే మున్సిపల్ కార్మికుల సమస్యలపై సి డి ఎం ఏ ఆఫీస్ వద్ద ధర్నాను జయప్రదం చేయండి

ఈనెల 25వ తారీకున జరిగే మున్సిపల్ కార్మికుల సమస్యలపై సి డి ఎం ఏ ఆఫీస్ వద్ద ధర్నాను జయప్రదం చేయండి

-సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్

శంకర్ పల్లి అక్టోబర్ 23(ప్రజాక్షేత్రం):పట్టణ కేంద్రంలో ఈనెల 25న మున్సిపల్ కార్మికుల సమస్యలపై సి డి ఎం ఏ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాకు సంబంధించి శంకర్ పల్లి కమిషనర్ శ్రీనివాస్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ నూతన పిఆర్సిలో కనీస వేతనం 26,000 నిర్ణయించాలని, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేస్తున్న మున్సిపల్ సిబ్బంది అందరిని పర్మనెంట్ చేయాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్న వేతనాలు అమలు చేయాలని కార్మికుల ఇతర సమస్యలు పరిష్కరించాలని, జీవో ఆర్టీ నెంబర్ 1037లో ప్రతిపాదించిన మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సేవలను థర్డ్ పార్టీకి అప్పజెప్పాలని నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తదితర డిమాండ్లపై ఈ నెల 25న సిడిఎంఏ కార్యాలయం వద్ద రాష్ట్ర వ్యాప్త ధర్నాను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు బిసొల్ల రమేష్, కోశాధికారి రాములు శాంతయ్య శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts