Praja Kshetram
సినిమా న్యూస్

బలగం సినిమా తరహాలో మరో కుటుంబ కథ చిత్రం “లగ్గం”.. రిలీజ్ ఎప్పుడంటే..!

బలగం సినిమా తరహాలో మరో కుటుంబ కథ చిత్రం “లగ్గం”.. రిలీజ్ ఎప్పుడంటే..!

 

హైదరాబాద్ అక్టోబర్ 24(ప్రజాక్షేత్రం):జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్ వేణు ద‌ర్శ‌కుడిగా మారి తెర‌కెక్కించిన చిత్రం బ‌ల‌గం. కుటుంబ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.ఈ సినిమా ప్ర‌తి ఒక్క కుటుంబానికి చాలా ద‌గ్గ‌రైంది. ఇప్పుడు అలాంటి నేప‌థ్యంలోనే ల‌గ్గం అనే సినిమా రూపొంద‌గా, ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 25న థియేట‌ర్స్‌లోకి తీసుకు రాబోతున్నారు. స్థానికంగా ఉండే సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంతో వస్తున్న చిత్రం లగ్గం. గ్రామీణ కుటుంబాల్లో ఉండే ప్రేమానురాగాలు, భావోద్వేగాలతో ఈ సినిమా రూపొందిందనే విషయం ట్రైలర్ స్పష్టం చేసింది. రమేష్‌ చెప్పాల దర్శకత్వంలో సాయిరోనక్‌, ప్రగ్యా నాగ్ర జంటగా నటించిన ‘లగ్గం చిత్రాన్ని సుబిషి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వేణుగోపాల్‌ రెడ్డి నిర్మించారు. గురువారం సాయంత్రం 6 గంటలకు కేవలం మహిళామణులకు కూకట్ పల్లిలోని అర్జున్ థియేటర్లో “లగ్గం” సినిమా స్పెషల్ ప్రివ్యూ ఏర్పాటు చేశారు. అంద‌రు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని చిత్ర బృందం కోరింది. ఇటీవ‌ల చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌గా, ఆ కార్య‌క్ర‌మంలో క‌మెడీయ‌న్ స‌ప్త‌గిరి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.”లగ్గం సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే 2024 నేషనల్ అవార్డ్ విన్నర్ ఈ మూవీ. అలాగే, నేషనల్ అవార్డే కాదు వరల్డ్ వైడ్‌గా ఎన్ని అవార్డ్స్ ఉన్నాయో అన్ని గెలుచుకునే గొప్ప సినిమా. అలాగే డబ్బులు కూడా వచ్చే సినిమా. కాబట్టి, కచ్చితంగా 25వ తేది నాడు ఇది మీ సినిమాగా భావించి.. మీ ఇంట్లోని ఎమోషన్స్ అన్ని ఇందులో ఉంటాయి కాబట్టి.. మధ్యతరగతి వాళ్ల మనసును కదిలించే లగ్గం మూవీకి తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను” అని సప్తగిరి పేర్కొన్నారు. లగ్గం టైటిల్‌కు చాలా మంది కనెక్ట్ అవ్వడమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. మా సినిమా టైటిల్‌కు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి వస్తున్న స్పందనతో చాలా హ్యాపీగా ఉంది అని దర్శకుడు వెల్లడించారు. రైతు కుటుంబం, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, ప్రవాస భారతీయుల అంశాలు చిత్రంలో క‌థ‌ను మలుపుతిప్పుతాయ‌ట‌. కొన్ని భావోద్వేగాల‌తో కూడిన స‌న్నివేశాలు మ‌న‌కు దృశ్య కావ్యం చూశామ‌నే అనుభూతిని క‌లిగిస్తాయ‌ని అంటున్నారు. లగ్గం సినిమా క్లైమాక్స్‌ను అత్యంత నిజాయితీగా చెప్పాలనే ప్రయత్నం చేశాను. నా ప్రయత్నం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని అనుకొంటున్నాను అని రమేష్ చెప్పాల అన్నారు.

Related posts