Praja Kshetram
తెలంగాణ

పేదలు అంటే అంత అలుసా.! మూసి బాధితులకు అన్యాయం చేయొద్దు.

పేదలు అంటే అంత అలుసా.! మూసి బాధితులకు అన్యాయం చేయొద్దు.

-రేవంత్ రెడ్డి చేసేది పేదల కోసం కాదు.

-డబ్బు సంచుల కోసం,బ్లాక్ మెయిలింగ్ కోసం.

-ఖబర్దార్ రేవంత్ రెడ్డి.

-ప్రజలను ముంచే విధంగా కాంగ్రెస్ పరిపాలన-మంత్రి కిషన్ రెడ్డి.

-కాంగ్రెస్ వచ్చింది కతం చేస్తుంది. మూసి బాధితుల పట్ల మేమున్నాం-మంత్రి బండి సంజయ్.

-పేదలకు అన్యాయం చేస్తే ఊరుకునేది-లేదు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

హైదరాబాద్ అక్టోబర్:25(ప్రజాక్షేత్రం):మూసి బాధితుల కోసం శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద బిజెపి ధర్నా చేపట్టింది.ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి,బండి సంజయ్, మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని వారే కళ్ళకు అద్దినట్టు చూపిస్తున్నారు.మేము ప్రజల పక్షాన మాట్లాడుతుంటే నడమంత్రపు సిరితో ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడవద్దు.రేవంత్ రెడ్డి ఖబర్ధార్ మూసీ లో దుర్గంధం క్లీన్ చెయ్యి కానీ మా భూములు లాక్కొని పెద్దలకు ఇస్తా అంటే పేదలు చూస్తూ ఊరుకోరు.మా బొందల గడ్డ చూస్తమంటే మీ బొందలగడ్డ చూస్తాం అని ప్రజలు అంటున్నారు.మూసీ బాధితుల కోసం ఇందిరా పార్కు దగ్గర బీజేపీ ధర్నా లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ మేం వారికి అండగా ఉంటాం.మూసీ,చెరువల పక్కన ఉన్నవాళ్లకు నాలుగు నెలలుగా కంటిమీద కునుకులేకుండా పోయింది.పొట్టచేత పట్టుకొని హైదరాబాద్ కు వచ్చి ఒక తరం త్యాగం చేసి పైసా పైసా కూడబెట్టుకుంటే 50 గజాల జాగా కొనుక్కున్నారు. చనిపోతే అనాథ శవంలా పోవద్దు అని ఇళ్ళు కట్టుకుంటే.. ఇప్పుడు అర్ధరాత్రి వచ్చి ఇళ్ళు కూలగొడుతున్నారు. ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.చెరువుల పక్కన, మూసీ పక్కన ఉన్నవి అన్నీ ప్రభుత్వ భూములు కావు, పట్టా భూములు కూడా ఉన్నాయి. అందులో బ్యాంక్ రుణాలు తీసికొని కట్టుకున్న వాళ్ళు ఉన్నారు దయచేసి పేదల కు అన్యాయం చేయకండి అని బీజేపీ తరపున మూసి ప్రక్షాళన కోసం ప్లానింగ్ ఇస్తాం అని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు.

Related posts