Praja Kshetram
తెలంగాణ

కస్తూర్బా బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్?

కస్తూర్బా బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్?

 

సంగారెడ్డి జిల్లా అక్టోబర్ 26 (ప్రజాక్షేత్రం):సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ కస్తూర్బా గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థినులు రెండో రోజు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం తీవ్రమైన దగ్గు, ఇబ్బందిగా శ్వాస తీసుకోవడం, ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అయిన 13 మంది బాలికలు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం చికిత్సా నిమిత్తం ఆరోగ్యం నిలకడగా ఉందని ఇంటికి వెళ్లిపోయిన బాలికలు.. శనివారం తెల్లవారుజాము నుంచి మళ్లీ తీవ్రమైన అస్వస్థతకు లోనవడంతో తిరిగి ఆస్పత్రిలో చేరారు.

Related posts