కబ్జా కోరల్లో తాళ్లగూడా గ్రామ కంఠం
-డిపిఓ కు ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదు
-దళిత భూ బాధితులకు న్యాయం జరిగేనా..?
షాద్ నగర్, అక్టోబరు 26 (ప్రజాక్షేత్రం):నందిగామ మండలం, నర్సప్పగూడ అనుబంధ గ్రామం తాళ్లగూడ లో అక్రమంగా గ్రామ కంఠం భూమిని అదే గ్రామానికి చెందిన కుడుముల లక్ష్మీపతి గౌడ్, బిక్షపతి గౌడ్, నవీన్ గౌడ్, వినోద్ అభిలాష్ అక్రమంగా 4500 గజాల భూమి లో సిమెంట్ కడిలతో కంచగా వేసి కబ్జా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.అక్రమ కబ్జాలకు సహకరించిన గ్రామ సెక్రెటరీ వెంకటయ్య గౌడ్ పై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ సెక్రెటరీ వెంకటయ్య గౌడ్ సహకారంతోనే కబ్జా చేశారని గ్రామస్తులు విట్యాల లింగయ్య మరికొందరు గ్రామస్తులు డిపిఓ వినతి ఇచ్చిన స్పందించని నందిగామ మండల ఎంపీడీవో గతంలో చేగూర్ అనుబంధ గ్రామ లో ఉన్నప్పుడు లింగయ్య 500 గజాల భూమి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్న లింగయ్య భూమిని కుడుముల కుటుంబ సభ్యులు అక్రమంగా ఆక్రమించుకున్నారు. దళితులు వెళ్లే స్మశాన వాటికను కబ్జా చేశారని గ్రామస్తులు తెలిపారు. కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన ఎంపీడీవో, ఎంపీ ఓ, గ్రామ సెక్రెటరీ లో, ఎలాంటి చర్యలు తీసుకోలేరని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుకుంటున్నారు. నందిగామ మండల ఎంపీడీవో ను వివరణ అడగగా ఈ యొక్క సమస్యను వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని అన్నారు.