Praja Kshetram
తెలంగాణ

ఎస్సీ వర్గీకరణను అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ తో యుద్ధమే.

ఎస్సీ వర్గీకరణను అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ తో యుద్ధమే.

 

-మాటలతో మభ్యపెట్టడం కాదు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని అమలుపరచు..

-ఎస్సి వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలను భర్తీ చేయడమంటే మాజాతుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడమే.

-ఎస్సి వర్గీకరణ అమలు అయ్యేంత వరకు ఉద్యోగ నియామకాలన్ని నిలిపివేయాలి.

-ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ

వరంగల్ అక్టోబర్ 26 (ప్రజాక్షేత్రం):ఎస్సి వర్గీకరణను అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ తో యుద్ధమే కొనసాగుతుందని, సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే అసెంబ్లీ సాక్షిగా దేశంలో మేమే మొదట వర్గీకరణ అమలు చేస్తామని, అన్ని నోటిఫికేషన్లకు వర్తించేలా ఆర్డినెన్సు తెస్తామని మోసపు మాటలు చెప్పిన ముఖ్యమంత్రి ఎస్సి వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలను భర్తీ చేస్తూ నమ్మకద్రోహం చేస్తున్నాడని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. హన్మకొండ హంటర్ రోడ్డు డి కన్వెన్షన్ హల్ నందు ఎస్సి వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాలను భర్తీ చేస్తూ మాదిగలకు అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్దం కావడానికి ఉమ్మడి వరంగల్ జిల్లా మాదిగల ధర్మయుద్ధ మహాసభను నిర్వహించడం జరిగింది. ఈ సభకు ఎమ్మార్పీఎస్ హన్మకొండ అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ అధ్యక్షత వహించగా మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నమ్మితే ఎంత మోసం చేస్తాడో టీచర్ల ఉద్యోగాల నియామకాలతో తేలిపోయిందని, 11వెలకు పైగా ఉద్యోగాల్లో ఎస్సి వర్గీకరణ లేకపోవడం వలన మాదిగ, మాదిగ ఉప కులాలు తీవ్రంగా నష్టపోయాయని, మరల గ్రూపు 1,2,3,4 ఉద్యోగాలు, వివిధ డిపార్ట్మెంట్ల ఉద్యోగాలను కూడా మనకు దక్కకుండా రేవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఎస్సి వర్గీకరణను అమలు చేయడానికి నిర్లక్ష్యం ఎందుకని, తోటి పంజాబ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సి వర్గీకరణ అమలు చేస్తుంటే దేశంలో నేనే మొదట అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి కాలయాపన చేస్తున్నాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి మాటలకు, చేతలకు చాలా వ్యత్యాసం ఉంటుందని మాటలను నమ్మి మోసపోవడం కాదు, తను ఆడే కమిషన్ నాటకాలు, మాటలతో మభ్యపెట్టడం కాదు చిత్తశుద్ది, నిజాయితీ ఉంటే అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని అమలుపరచు అని హితవు పలికారు. ఎస్సి వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలను భర్తీ చేయడమంటే మాజాతుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడమేనని ఆలస్యం చేయకుండా తక్షణమే ఎస్సి వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 30 ఏండ్లుగా అనేక త్యాగాలు, పోరాటాల ఫలితంగా భారత అత్యున్నత న్యాయవ్యవస్థ ద్వారా సాధించుకున్న విజయాన్ని మన ధరికి చేర్చకుండా, మన నోటికాడి బుక్కను లాగేస్తున్న ద్రోహి రేవంత్ రెడ్డి అని అన్నారు. ఎస్సి వర్గీకరణ అమలు అయ్యేంత వరకు ఉద్యోగ నియామకాలన్ని నిలిపివేయాలని, ఎస్సి వర్గీకరణ ప్రకారమే ఉద్యోగాలను చేపట్టాలని అన్నారు. మాదిగ కోటలో మంత్రిగా, ఎంఎల్ఏ లుగా జాతి బిడ్డలు మన జాతికి చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించకుండా, తిరుగుబాటు చేయకుండా భజన చేస్తూ బానిసత్వం చేస్తున్నారని, మీకు జాతి పట్ల చిత్తశుద్ధి ఉంటే అధిష్ఠానంతో కొట్లాడాలని అన్నారు. రేవంత్ మోసంపై ధర్మ యుద్ధానికి సిద్ధం కావాలని, మన జాతులకు చేస్తున్న మోసాన్ని, ద్రోహాన్ని ప్రజలకు వివరిస్తూ యుద్ధానికి సిద్ధం చేయాలని అందులో భాగంగానే ఉమ్మడి జిల్లాలో ధర్మ యుద్ధ సభలు జరుగుతున్నాయని, తర్వాత రథయాత్రతో తెలంగాణలో ఉన్న అన్ని నియోజక వర్గాలు, మండలాలను చుట్టుముట్టి డిఎస్సీ 21న ఛలో హైదరాబాద్ తో ధర్మయుద్ధ మహప్రదర్శనతో రేవంత్ సర్కార్ తో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు.

Related posts