పెండింగ్ స్కాలర్‌షిప్స్ ఇవ్వాలి
-ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా
-విద్యార్థులతో కిక్కిరిసిన తెలంగాణ చౌరస్తా
మహబూబ్‌నగర్ అక్టోబరు 26 (ప్రజాక్షేత్రం): విద్యార్థుల పెండిం గ్ స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేశారు. ఽఽధర్నాకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరుకావడంతో చౌరస్తా కిక్కిరిసింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా కన్వీనర్ సతీష్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.7,500 కోట్లపైగా బకాయి ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావొస్తున్నా బకాయిలు చెల్లించడం లేదన్నారు. ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తి చేసిన వారికి యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదని, ఫీజులు చెల్లిస్తేనే ఇస్తామని అంటున్నాయని చెప్పారు. ప్రభుత్వం వెంటనే పెం డింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శివ ప్రసాద్, శివసాగర్, అక్షయ, కార్తీక్‌చ శివరామ్, విద్యార్థులు పాల్గొన్నారు.