డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
-హైదరాబాద్ యాంటీ నార్కోటిక్స్ డీఎస్పీ హరీష్ చంద్రారెడ్డి
చేవెళ్ల, అక్టోబరు 26(ప్రజాక్షేత్రం):యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి బాగా చదువుకోవాలని హైదరాబాద్ యాంటీ నార్కోటిక్స్ డీఎస్పీ హరీష్ చంద్రారెడ్డి తెలిపారు. శనివారం చేవెళ్ల మండల కేంద్రంలోని వివేకానంద కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు మత్తు పదార్థాలకు ఆలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నా, విక్రయించినట్లు తెలిసినా పోలీసులకు సమాచారం అందించాలని, అప్పుడే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్, నార్కోటిక్ సీఐలు శ్రీనివా్‌సరావు, గోపి, కళాశాల ప్రిన్సిపాల్ జైపాల్‌రెడ్డి, డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఉన్నారు.