విధి కుక్కల దాడికి పదిహేను(15) గొర్రెలు బలి మనుషులకే కదు జంతువులకు కూడా తప్పని విధి కుక్కల ముప్పు
మొయినాబాద్: అక్టోబర్ 27 (ప్రజా క్షేత్రం) మండలంలోని అప్పోజి గూడ గ్రామంలో రైతు గొర్రెల కాపరి గొల్లగూడెం పెంటయ్య రోజులాగే గొర్ల మంద దగ్గర అర్థ రాత్రి నిద్రిస్తున్న సమయంలో గొర్ల దొడ్డిపై పది పదిహేను వీధి కుక్కలు దాడి చేశాయి వాటి దటికి సుమారు పదిహేను గొర్రెలు ప్రాణాలు నేలకొరిగాయి విచక్షణ రహితంగా చంపి పొట్టలోని అవయవాలు అన్ని బయటికి తీశాయి మెడ భాగంలో ఎక్కువ చోట్ల కరిచి చంపేశాయి. పెంటయ్యకు గొర్రెల పెంపకం జీవనాధారం ఇది తప్ప మరోకటి లేదు ఎలాగైనా ప్రభుత్వం తనను ఆదుకోవాలని గొర్రెల కాపరి రైతు పెంటయ్య బోరున విలపిస్తున్నారు. గ్రామ ప్రజలు మొత్తం అక్కడికి చేరుకొని తిలకించారు గ్రామంలో కూడా విధి కుక్కల బెడద ఉన్నది చిన్నారులకు రక్షణ కల్పించాలని పెంటయ్యను ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరారు.