Praja Kshetram
క్రైమ్ న్యూస్

జనగామ షాపింగ్ మాల్స్ లో భారీ అగ్ని ప్రమాదం..

జనగామ షాపింగ్ మాల్స్ లో భారీ అగ్ని ప్రమాదం..

జనగామ అక్టోబర్ 27(ప్రజాక్షేత్రం): తెలంగాణలోని జనగామ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బస్టాండ్‌కు కొద్దిదూరంలో సిద్దిపేట వెళ్లే మార్గంలో విజయ షాపింగ్ మాల్, శ్రీలక్ష్మి షాపింగ్ మాల్స్‌లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రెండు షాపింగ్ మాల్స్ పక్కపక్కనే ఉన్నాయి. మొదట విజయ షాపింగ్ మాల్‌లో మంటలు చెలరేగగా, ఆ తర్వాత పక్కనే ఉన్న శ్రీలక్ష్మి బట్టల దుకాణానికి మంటలు అంటుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలియగానే జనగామ సీఐ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనస్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. జనగామ ఫైరింజన్లు సరిపోకపోవడంతో పక్కనే ఉన్న స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, ఆలేరు ప్రాంతాల నుంచి కూడా ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పేశాయి. ఈ ప్రమాదం కారణంగా రెండు బట్టల దుకాణాల్లో రూ.10 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు.

Related posts