ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలి
-నవంబర్ 6న తుక్కుగుడలో మాదిగల ధర్మయుద్ధ సదస్సు
-మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ శంషాబాద్ మండల ఇంచార్జి మహేష్ మాదిగ
శంషాబాద్ అక్టోబర్ 29 (ప్రజాక్షేత్రం):అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలులోకి తీసుకువచ్చిన తరువాతనే ఉద్యోగాలు భర్తీ చేయలని ఎమ్మెస్సెఫ్ శంషాబాద్ మండల ఇంచార్జి మహేష్ మాదిగ డిమాండ్ చేశారు. ఇందుకోసం శంషాబాద్ మండల కేంద్రంలోని ఎం ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో నారాయణ కళాశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల ఇంచార్జి మహేష్ మాదిగ మాట్లాడుతూ ” సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి ఎస్సీ వర్గీకరణ అమలులో చేయడంలో దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలబెడతామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేసి మాదిగలకు ద్రోహం చేశాడని అన్నారు. తక్షణమే ఉద్యోగాల భర్తీ నిలిపివేయాలని అన్నారు. ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ కు ఎస్సీ వర్గీకరణను వర్తింపజేస్తామని అవసరమైతే అందుకు ఆర్డినెన్సు తీసుకువస్తామని అసెంబ్లీలో ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆ ప్రకటనకు ఎందుకు కట్టుబడి లేడు అని ప్రశ్నించారు. కమిటీలు, కమిషన్ల పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలి. అప్పటి వరకు ఉద్యోగ నియామకాలన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాదిగల ధర్మయుద్ద సదస్సును నవంబర్ 6న ఉదయం 11గంటలకు తుక్కుగూడలో నిర్వహిస్తున్నామని ముఖ్య అతిధులుగా మంద కృష్ణ మాదిగ పాల్గొంటారని అన్నారు. కావున మాదిగ విద్యార్థులు యువకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ మండలం ఎం ఎస్ ఎఫ్ ఇన్చార్జి మహేష్ మరియు సిద్దు మాదిగ చరణ్ మాదిగ, నితిన్ మాదిగ, పాల్గొనడం జరిగింది.