Praja Kshetram
తెలంగాణ

నకిలీ పత్రాలతో ల్యాండ్ కబ్జా… పోలీసుల అదుపులో సికింద్రాబాద్ సబ్ రిజిస్టర్

నకిలీ పత్రాలతో ల్యాండ్ కబ్జా… పోలీసుల అదుపులో సికింద్రాబాద్ సబ్ రిజిస్టర్

 

హైదరాబాద్ అక్టోబర్ 29 (ప్రజాక్షేత్రం): సికింద్రాబాద్ సబ్ రిజిస్టర్ జ్యోతిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ కోర్టులో పోలీసులు ఈ రోజు మంగళవారం హాజరుపరిచారు. సబ్ రిజిస్ట్రార్ జ్యోతికి 14 రోజుల పాటు మేడ్చల్ కోర్ట్ రిమాండ్ విధించింది. సుభాష్ నగర్‌లో 200 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో బీఆర్ఎస్ నేత పద్మాజా రెడ్డి కబ్జా చేసింది. బీఆర్ఎస్ హయాంలో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్‌గా జ్యోతి పనిచేసింది. నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్‌ చేయడానికి పద్మజా రెడ్డికి సబ్ రిజిస్టర్ జ్యోతి సహకరించింది. కాగా ఇదే కేసులో ఇటీవల పద్మజా రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పోలీసులు తరలించారు. తాజాగా ఈ కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్టార్ జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేసి ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు.

Related posts