Praja Kshetram
తెలంగాణ

అసైన్మెంట్ భూమి అక్రమణ

అసైన్మెంట్ భూమి అక్రమణ

-పట్టించుకోని సంబంధిత అధికారులు

-రైతుల పేర్ల నుండి రియార్టర్ పేర్లకు మార్పు

కొండాపూర్ అక్టోబర్ 29(ప్రజాక్షేత్రం):జిల్లా కలెక్టర్ ప్రభుత్వ భూమి కబ్జాలకు పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అందరికీ తెలిసిన విషయమే. కాగా కొండాపూర్ మండల పరిధిలోని మన్సాన్పల్లి గ్రామ ప్రభుత్వ భూమి రెండు ఎకరాలు శంకర్ పల్లి నుండి వికారాబాద్ వెళ్లే ప్రధాన రహదారి పక్కనే వున్నా దాదాపు సుమారు 7 కోట్లకు ఎకరం పలుకుతున్న భూమిని కబ్జా చేసారు వివరాల్లోకెళ్తే మన్సాన్పల్లి గ్రామ రైతు మందుల పరమయ్య, ఆంజనేయులు పేర్ల పై నుండి హైదరాబాద్ కు చెందిన బడా రియాటర్లు విద్యాసాగర్, వరప్రసాద్ పేర్లపైకి సర్వే నెంబర్ 190/ఆ1,190/ఆ లో పూర్తి విస్తీర్ణం 2ఎకరాలు 2003-2004లో తారుమారు కావడం జరిగింది. అప్పటి నుండి నేటి వరకు మామిడి తోట సాగు చేస్తూ సంవత్సరానికి మూడు నుంచి నాలుగు లక్షల వ్యాపారం చేస్తున్నారు. ఈ సంఘటన పలుమార్లు వార్తాపత్రికల్లో ప్రచురించినా ఇంతకు ముందున్న రెవెన్యూ అధికారులు కేసు కోర్టులో ఉందని ఏదో ఒక మాట చెప్పి ఊరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ భూమి (అసైన్మెంట్) భూమి అమ్మడం గాని కొనడం గాని జరిగినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. గ్రామపంచాయతీ పరిధిలో ఏదైనా నిర్మించాలంటే గ్రామపంచాయతీ అనుమతులు తప్పకుండా కావలసి ఉంటుంది. కాని దాదాపు20 సంవత్సరాల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమి లో అద్భుతమైన భవనం ఏర్పాటు చేసి అందులో కూలీలు ఉండడానికి ఏర్పాటు చేశామని మాయమాటలు చెపుతున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలను చేశారు. ఈ విషయం మండల స్థాయి అధికారుల నుండి జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ భూమి ఇతరుల పేర్లకు మార్చాలంటే (ఎన్ ఓ సి) నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కావలసి ఉంటుంది. సంబంధిత మండల రెవెన్యూ అధికారులను ఆర్టిఐ ప్రకారం ఏ రకంగా రైతుల పేర్లు నుండి ఇతరుల పేర్లకు మార్చారు అనే విషయంపై అడిగిన ఎలాంటి సమాచారం ఇవ్వకుండాసైలెంట్ గా ఉన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Related posts