Praja Kshetram
తెలంగాణ

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై హైకోర్టు ఆదేశాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై హైకోర్టు ఆదేశాలు

 

హైదరాబాద్ అక్టోబర్ 30 (ప్రజాక్షేత్రం): రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసే బీసీ (BC) రిజర్వేషన్ల అధ్యయనానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అధ్యయనాన్ని బీసీ కమిషన్‌కు అప్పజెప్పడాన్ని పిటిషనర్ తరఫున న్యాయవాది తప్పుబట్టారు. అది సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధమని పేర్కొన్నారు. కాగా 2 వారాల్లో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Related posts